My title

సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన రాందేవ్ బాబా

ఢిల్లీలో బాణా సంచా అమ్మ‌కాల‌కు సుప్రీంకోర్ట్ బ్రేక్ వేయ‌డంతో వ్యాపారులు ఆన్‌లైన్ బాట ప‌ట్టారు. మ‌తాబుల వెలుగులు చూస్తూ ఎంజాయ్ చేద్దామ‌ని అనుకుంటున్న వారికి కావ‌ల‌సిన స‌రుకుల‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఇంటికే బాణాసంచాను చేర‌వేస్తున్నారు. నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలు ఇస్తున్నారు. లాభాల‌ను గ‌డిస్తున్నారు.

వాట్స్ యాప్ ద్వారా ఆర్డ‌ర్ల‌ను తీసుకుంటున్నారు. ముందు స‌గం ధ‌ర చెల్లిస్తేనే ఆర్డర్ల‌ను తీసుకుంటున్నారు. మిగ‌తా స‌గం డ‌బ్బు డెలివ‌రీ స‌మ‌యంలో తీసుకుంటున్నారు. న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఢిల్లీలోను, నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లోను బాణాసంచా అమ్మ‌కాల‌ను సుప్రీంకోర్టు నిషేధించ‌డంతో వ్యాపార‌స్తులు గుట్టు చ‌ప్పుడు కాకుండా వ్య‌వ‌హారం న‌డిపిస్తున్నారు.

పోలీసుల‌కు ఈ స‌మాచారం అంద‌డంతో వ్యాపార‌స్థుల‌ను బెదిరించే ప‌నిలో ప‌డ్డారు. ఆన్‌లైన్ దందాను ఆపివేయాల‌ని లేనిచో అమ్మిన వారిపైనా, కొన్న‌వారిపైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన రాందేవ్ బాబా

ప్ర‌సిద్ధ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. హిందువుల పండ‌గ‌ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పండ‌గ‌ల విష‌యంలో కూడా న్యాయ‌స్థానాలు క‌ల‌గ‌జేసుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని ఆయ‌న అన్నారు.

బాణాసంచా అమ్మ‌కాల‌ను నిషేదిస్తూ ఉన్న‌త న్యాయ‌స్థానం తీసుకున్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స‌మ‌ర్ధించ‌డాన్ని రాందేవ్ త‌ప్పుబ‌ట్టారు. శ‌శిథ‌రూర్ వంటి వ్య‌క్తి అలా మాట్లాడాల్సి ఉండ‌కూడ‌ద‌ని రాందేవ్ అన్నారు.