My title

మణి రత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా లెనట్టే

రామ్ చరణ్ తో మణిరత్నం సినిమా.. మీన మేషాలు లెక్కపెట్టే దగ్గరే ఆగిపోతోంది. టాప్ డైరెక్టర్ అయిన మణికి కూడా.. ఇది నచ్చనట్టే తెలుస్తోంది. దీంతో.. చెర్రీ ప్రాజెక్టును పక్కన పెట్టేసిన మణి.. మల్టీ స్టారర్ కు ప్లాన్ చేసినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో దుల్కర్ సల్మాన్ తో హిట్ కొట్టిన మణి.. ఇప్పుడు మళ్లీ అతడినే హీరోగా తీసుకుని.. అరవింద స్వామి, ఫాహత్ ఫాజిల్ లాంటి ప్రముఖ స్టార్లకు ఇంపార్టెన్స్ ఉన్న కేరెక్టర్లు ఇచ్చి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ఈ మూవీలో.. హీరోయిన్ల ఎంపికపై కూడా మణి కసరత్తు పూర్తయినట్టు సమాచారం. అందులో భాగంగానే.. ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు దాదాపు ఫైనల్ అయిందని తెలుస్తోంది. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తారో.. ఆ రోల్స్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. అందరికీ తెలిసిందే. అందుకే.. కీర్తి సురేష్ కూడా.. ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే.. ఈ ప్రపోజ్డ్ మల్టీ స్టారర్ ప్రాజెక్టు గురించి.. పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. దీంతో.. చెర్రీతో మణి రత్నం సినిమా ఇక ఆగిపోయినట్టే అని కన్ఫమ్ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.