తమ్ముడి తో అయిపోయింది ఇప్పుడు అన్న తో మొదలెట్టింది

336

తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తన తోటి హీరోయిన్స్ అయిన ప్రగ్య జైస్వాల్, రెజిన ఇంకా కుర్ర హీరోలతో నటిస్తుంటే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్టార్ హీరోస్ తో జత కడుతుంది. “స్పైడర్” లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన్ నటించిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో సూర్య తో కూడా ఒక మూవీ లో నటించబోతుంది. ఇప్పటికే కార్తి తో “తీరన్ అదిగారం ఒండ్రు” తెలుగులో ‘ఖాకి’ మూవీలో నటించిన ఆమె త్వరలోనే కార్తి అన్న అయిన సూర్య చిత్రంలో కూడా నటించే అవకాశముందని గతంలో వార్తలోచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న రకుల్ లేటెస్ట్ గా జరిగిన “ఖాకి” ప్రమోషనల్ ఈవెంట్‌లో నోరు విప్పి సూర్య సినిమాలో నటిస్తున్నానంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ మూవీ ని సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలో పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మిగతా టెక్నీషియన్స్ డీటెయిల్స్ తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

NEWS UPDATES

CINEMA UPDATES