My title

రాజుసుందరం అందుకే తప్పుకున్నాడట….

కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు హీరో నిఖిల్. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా రాబోతోంది. ఈ సినిమా కోసం కొందరు నటీనటులు కావాలంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చింది యూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రాజు సుందరం ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సీనియర్ దర్శకుడు కమ్ కొరియోగ్రాఫర్ ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

కిరాక్ పార్టీ రీమేక్ కు సంబంధించి సుధీర్ వర్మ, చందు మొండేటి లేకపోతే చేయనని చెప్పేశాడట నిఖిల్. ఎందుకంటే స్వామి రారా, కేశవ లాంటి హిట్స్ ఇచ్చాడు సుధీర్ వర్మ. ఇక చందు మొండేటి అయితే కార్తికేయ లాంటి హిట్ ఇచ్చాడు. అందుకే రీమేక్ విషయంలో వీళ్లిద్దరి పర్యవేక్షణ ఉండాల్సిందేనని పట్టుబట్టాడు నిఖిల్. వాళ్లిద్దరూ ఉంటే ఇక నేనెందుకంటూ రాజు సందరం వెళ్లిపోయాడు. అందుకే కొత్త దర్శకుడితో రీమేక్ లాగించేస్తున్నారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మొండేటి డైలాగ్స్ చూసుకుంటున్నారు.