My title

రాజుగారి గది-2…. కేవలం 2 గంటలే

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు స్క్రీన్ ప్లే పరంగా ఎంత టైట్ గా ఉంటే అంత మంచిది. అప్పుడే ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతాడు. నిర్మాత ఖుషీ అవుతాడు. ఈ విషయం నాగార్జునకు కూడా తెలుసు. కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ సినిమా చేస్తున్న నాగార్జున.. హారర్ కు ఉండాల్సిన ఈ ప్రధాన లక్షణాన్ని మాత్రం ముందే పసిగట్టాడు. అందుకే ఎడిటింగ్ టేబుల్ పై కూర్చొని దగ్గరుండి కత్తెరకు పదునుపెట్టాడు. అలా రెండున్నర గంటలు ఉండాల్సిన రాజుగారి గది-2 సినిమా ఏకంగా 30 నిమిషాలు కోల్పోయి జస్ట్ 2 గంటల మూవీగా తయారైంది.

అవును.. రాజుగారి గది-2 సినిమా సెన్సార్ సర్టిఫికేట్ బయటకొచ్చింది. సినిమా నిడివి కేవలం 127 నిమిషాలు మాత్రమే. సో.. మూవీ కచ్చితంగా థ్రిల్లింగ్ గా ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రుద్ర అనే మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఇక అమృత అనే లాయర్ పాత్రలో సమంత కనిపించనుంది. ఈ లాయర్ పాత్రే తర్వాత ఆత్మగా కూడా మారుతుందట.

సినిమాకు ఈ రెండు పాత్రలే కీలకమని తెలుస్తోంది. కేవలం ఈ రెండింటిపైనే ఫోకస్ పెడుతూ దర్శకుడు ఓంకార్ తెరకెక్కించాడట. ఇక తమన్ మ్యూజిక్ విషయానికొస్తే.. సినిమాలో చాలా పాటలు కట్ చేశారట. కేవలం 2 పాటలు మాత్రమే ఉంచారట.