My title

విడాకులకు దరఖాస్తు చేసిన సూపర్ స్టార్ కూతురు

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ విడాకులకు ధరఖాస్తు చేసుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఈ మేరకు ఆమె అఫిడవిట్ దాఖలు చేశారు. ఆరేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. సౌందర్య రజనీకాంత్-అశ్విన్ రామ్ కుమార్ లకు 2010లో ఘనంగా వివాహం జరిగింది. వాళ్లకు ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అబ్బాయి పేరు వేద్. కానీ కొంతకాలంగా సౌందర్య, రజనీకాంత్ ఇంట్లోనే ఉంటున్నారు. అశ్విన్ తో కాపురం చేయట్లేదు. ఈ విషయం అప్పట్లో మీడియా కూడా వచ్చింది. కానీ ఎవరూ నిర్థారించలేదు. అయితే సెప్టెంబర్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లయ్ చేయడంలో ఈ వార్త గుప్పుమంది. తాజాగా సౌందర్య, అశ్విన్ మరోసారి విడాకులకు సంబంధించి తమ అఫిడవిట్ దాఖలు చేశారు.

రజనీకాంత్ తో విక్రమసింహ సినిమాను తీశారు సౌందర్య. భారీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆమె ధనుష్ హీరోగా రఘువరన్ బీటెక్-2 అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ క్లాప్ తో ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. సౌందర్య-అశ్విన్ మధ్య అభిప్రాయబేధాలకు కారణాలు ఏంటనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published.

three × one =