My title

బాహుబ‌లి టీమ్ 613 రోజుల పాటు  చేశారు..!!

ఒక సినిమా కోసం  5 సంవ‌త్స‌రాలు వ‌ర్క్ చేయ‌డం అనేది  ఈ మ‌ధ్య కాలంలో  బాహుబ‌లి కోసం మాత్ర‌మే అని చెప్పాలి.  సినిమాను చాలా వేగంగా తీస్తున్న ఈ రోజుల్లో  ఇదొక గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.  ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి   బాహుబ‌లి కి సంబంధించి మంగ‌ళ‌వారం చివ‌రి వ‌ర్కింగ్ డే అని .. ఇదొక గొప్ప అనుభూతి అని ట్విట్ చేశారు.

బాహుబ‌లి రెండు భాగ‌ల కోసం దాదాపు 613రోజుల పాటు వ‌ర్క్ చేశార‌ట‌. ఈ రెండు భాగాల్లో   యుద్ద స‌న్నివేశాలు షూట్ చేయ‌డానికే 3 వంద‌ల  రోజులు ప‌ట్టింద‌ట‌. ప్ర‌పంచంలో ప్ర‌ఖ్యాతి  చెందిన  33 వి ఎఫ్ ఎక్స్ స్టూడియోలు ఒక త్రాటి మీద ప‌ని చేశాయ‌ట‌.సోమ‌వారం  సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. సౌత్ నుంచి   ఐమాక్స్ ఫార్మేట్ లో  రిలీజ్ అవుతున్న ఫ‌స్ట్  ఫిల్మ్ బాహుబలి కావ‌డం విశేషం. మొద‌టి భాగంతో్ పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా  బాహుబ‌లి 2 ఉంటుంద‌ని  రాజ‌మౌళి తెలిపారు.  ఈ నెల 28న  ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి 2  రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే.