My title

కన్నడలో మాట్లాడితేే కష్టాలు తీరతాయా రాజమౌళి

బాహబలి-2కు శాండిల్ వుడ్ లో కష్టాలు తప్పేలాా లేదు. మరో 8 రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా.. ఇప్పటికీ అక్కడింకా విడుదలపై సందిగ్దం కొనసాగుతూనే ఉంది. సెంటిమెంట్ తో ఆడుకుంటే ఇలానే ఉంటుందని కన్నడ సంఘాలు ఆరోపిస్తుంటే.. ఇది న్యాయం కాదంటున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికేే ఎన్నోసార్లు విజ్ఞప్తిచేసిన జక్కన్న ఈసారి ఏకంగా నేటివిటీ టచ్ కోసం కన్నడ భాషలోకి మారాడు.

కన్నడలో కన్నడిగులను ఉద్దేశించి మాట్లాడాడు రాజమౌళి. తమ సినిమాను కర్నాటకలో అడ్డుకోవద్దని విజ్ఞప్తిచేశాడు. సత్యరాజ్ అనే వ్యక్తి కేవలం సినిమాలో ఒక నటుడు మాత్రమేనని, అతడిపై కోపాన్ని బాహుబలి-2 లాంటి భారీ బడ్జెట్ సినిమాపై చూపించవద్దని కన్నడంలో వేడుకున్నాడు. బాహుబలి సినిమాను కన్నడ ప్రజలు ఆదరించారని, అందులో సత్యరాజ్ ఉన్నారని.. అలానే బాహుబలి-2ను కూడా ఆదరించాలని విజ్ఞప్తిచేశాడు. మరి రాజమౌళి కన్నడంలో చేసిన విజ్ఞప్తిని కన్నడిగులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

గతంలో కావేరీ జల వివాదంపై సత్యరాజ్ వివాాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ చేసి చాలాా రోజులైంది. అయితే ఆ వీడియో మరోసారి తాజాగా సోషల్ మీడియాలోకి రావడంతో వివాదం రాజుకుంది. అందుకే కర్నాటకలో కొన్ని స్వతంత్ర సంఘాలు ఏకమై, బాహుబలి-2 విడుదలను అడ్డుకుంటామని అల్టిమేటం జారీచేశాయి. దీంతో రాాజమౌళి కన్నడంలోకి షిఫ్ట్ అయి మరీ అడ్డుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు.