My title

రవితేజ సినిమా రెడీ అవుతోంది

ప్లానింగ్ ప్రకారం సినిమాలు పూర్తిచేయడం దిల్ రాజుకు అలవాటు. ఇచ్చిన మాట ప్రకారం సినిమాని కంప్లీట్ చేయడం రవితేజకు అలవాటు. వీళ్లిద్దరూ కలిశారు కాబట్టే రాజా ది గ్రేట్ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ ను ఈనెల 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాడు దిల్ రాజు. ఫిదా మేనియా ముగిసిపోవడంతో.. ఇకపై రాజా ది గ్రేట్ మూవీపై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా ఆగస్ట్ 15న స్వతంత్ర్య దినోత్సవ కానుకగా రాజా ది గ్రేట్ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాజా ది గ్రేట్ మూవీ. పక్కా కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అనిల్ రావిపూడి. ఇంతకుముందు పటాస్, సుప్రీమ్ సినిమాతో హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు.. ఈసారి రవితేజను అంధుడిగా చూపించబోతున్నాడు. ఇది పుకారు కాదు. నిజమే. సినిమా ఓపెనింగ్ రోజే రవితేజను అంధుడిగా చూపించే పోస్టర్ ను విడుదల చేసి.. రాజా ది గ్రేట్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇప్పుడు టీజర్ తో సిసలైన ప్రమోషన్ షురూ చేయబోతున్నారు.