My title

రీ-షూట్ జరుపుకుంటున్న “రాజా ది ది గ్రేట్”

రవితేజ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీ “రాజా ది గ్రేట్”. ఆల్ మోస్ట్ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 12 న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీ టీం కి దిల్ రాజు షాక్ ఇచ్చాడు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ మూవీ రఫ్ ఎడిట్ ని చూసాడు అంట దిల్ రాజు. చూసి కొన్ని సీన్స్ నచ్చని దిల్ రాజు డైరెక్టర్ అనిల్ రావి పూడిని కొన్ని సీన్స్ రీ-షూట్ చేయమని కోరాడట. దిల్ రాజు మాటకి గౌరవం ఇచ్చి అనిల్ రావిపూడి కూడా ఈ రీ-షూట్ కి ఒప్పుకున్నాడట. మాములుగా దిల్ రాజు రీ-షూట్ చేయమని చెప్పాడు అంటే దాంట్లో ఏదో ఒక ఫాల్ట్ ఉండి తీరుతుంది. సో మూవీ యూనిట్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రీ-షూట్ వర్క్ స్టార్ట్ చేసారట. రీసెంట్ గా ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ లో రాశి ఖన్నా, సాయి ధరం తేజ్ లు ఒక సాంగ్ లో తలుకున్న మేరవనున్నారు. మెహరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో రవి తేజ అంధుడి పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ ట్రాక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.