My title

పోస్ట్ పోన్ దిశగా “రాజా ది గ్రేట్” ?

మాస్ మహారాజ్ రవితేజ “బెంగాల్ టైగర్” సినిమా తరువాత రెండేళ్ళ గ్యాప్ తీసుకొని మరీ చేసిన మూవీ “రాజ ది గ్రేట్”. రవితేజ మూవీ ఇంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకి రావడంతో ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.”పటాస్” , “సుప్రీమ్” ఫేం అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ పై నిర్మాత  దిల్ రాజు భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు. అయితే రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , ట్రైలర్ కూడా మాస్ కి నచ్చడంతో ఈ మూవీతో రవితేజ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడం ఖాయం అనుకున్నారు.

కానీ దీపావళి సందర్బంగా ఈ నెల 19 న రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్ట్ పోన్ వైపు వెళ్తుందట. అవును ఈ సినిమా దీపావళికి రావడం కష్టం అనే వార్త పరిశ్రమలో వినిపిస్తుంది. కారణం సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదట. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్లో ప్యాచ్ వర్క్స్ ఇంకా మిగిలి ఉండడంతో పాటు అలాగే రవితేజ మొహరిన్ లపై కొన్ని సీన్స్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం మొహరిన్ కి సంబంధించిన సీన్స్ చిత్రీకరణలో టీం బిజీగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ షూట్  త్వరగా కంప్లీట్ చేసుకొని మూవీ దీపావళికి రిలీజ్ అవుతుందా లేకపోతే షూట్ వల్ల ఈ మూవీ ఈ నెల 19 న రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవుతుందా అనేది వేచి చూడాలి.