My title

రంగులరాట్నం తిప్పుతున్న రాజ్ తరుణ్

సినిమాలకు కొత్తకొత్త టైటిల్స్ పెట్టడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే అంత పబ్లిసిటీ. శమంతకమణి, నెపోలియన్, పైసా వసూల్, రంగస్థలం.. ఇలా చాలా టైటిల్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా రంగులరాట్నం అనే మరో టైటిల్ తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ కొత్త సినిమా కోసం ఈ పేరు అనుకుంటున్నారు.
తనకు హీరోగా జీవితాన్నిచ్చిన అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై మరోసారి నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఓ కొత్త దర్శకురాల్ని పరిచయం చేస్తూ నాగార్జున ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు రంగులరాట్నం అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ టైటిల్ ను నాగార్జున అఫీషియల్ గా వెల్లడించే అవకాశముందట.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ హీరో తాజాగా నటించిన అంధగాడు సినిమా మంచి విజయాన్నందుకుంది. అంతకంటే ముందొచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త కూడా హిట్ అయింది. అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమాపై అందరి చూపు పడింది.