My title

లేడిస్ టాయిలెట్‌లోకి వెళ్లిన రాహుల్ గాంధీ

గుజరాత్‌  ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది.  మోడీపై, గుజరాత్ ప్రభుత్వంపై ఏఐసీపీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ఒంటికాలిపై లేస్తున్నారు. తాజాగా గుజరాత్‌ లో పర్యటించిన ఆయన…. యువతతో సంవాద్ పేరిట ఉడేపూర్‌ జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిశాక ఎప్పటిలాగే చకచక నడుచుకుంటూ వచ్చిన రాహుల్ అక్కడే ఉన్న టాయిలెట్‌లోకి వెళ్లారు. అక్కడ టాయిలెట్ మగవాళ్లదా…. ఆడవాళ్లదా అని తెలియజేసే బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో లేడీస్ టాయిలెట్‌ అని రాసి ఉంది. గుజరాతీ చదవడం రాకపోవడంతో ఆయన నేరుగా లేడిస్ టాయిలెట్‌లోకి వెళ్లినట్టు భావిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కన ఉన్న వారు కూడా వారించలేదు.రాహుల్ లేడిస్ టాయిలెట్‌లోకి వెళ్లడాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు చకచక పోటోలు తీసేశారు.  రాహుల్ టాయిలెట్‌ నుంచి తిరిగి రాగానే అక్కడున్న వారంతా పెద్ద పెట్టున నవ్వేశారు. అయితే లోనికి వెళ్లిన తర్వాత రాహుల్ అసలు విషయాన్ని గమనించి బయటకు వచ్చారా లేక పని పూర్తి చేసుకుని వచ్చారా అన్నది క్లారిటీ లేదు.