My title

“నాయకులు, వ్యాపారులు బ్యాంకులను దోచుకున్నారు” – రాహుల్‌ బజాజ్‌

బడావ్యాపారులు, రాజకీయ నాయకులు బ్యాంకు ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వరంగ బ్యాంకులను దోచుకు తినేశారని బజాజ్‌ గ్రూప్‌ హెడ్‌ రాహుల్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. నిజాయితీ గల వ్యక్తులు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వీళ్లు దోచేసుకుంటున్నారని, ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును వీళ్లు లోన్‌లుగా తీసుకుని ఎగ్గొడుతున్నారని దాంతో మొండి బాకీలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల పోటీతత్వం పోయిందని, నాణ్యత పడిపోయిందని, పెట్టుబడులు తగ్గాయని ఆయన అన్నారు. అనవసరపు సబ్సిడీలు భారత ఆర్ధిక వ్యవస్థకు గుదిబండగా మారాయని వీటి వెనక ప్రభుత్వాల అవినీతి ఉందని చెప్పారు. ప్రభుత్వాల అసమర్ధత, అవినీతి వల్లే దేశంలో పన్నుల ఎగవేతలు పెరిగాయని, దీంతో నిజాయితీపరులు నష్టపోయారని, అవినీతిపరులు లాభ పడ్డారని ఆయన విమర్శించారు.