My title

రాశి హిట్‌… సినిమా సోసో..!!

దాదాపు 70 చిత్రాలు న‌టిగా  చేసిన రాసి..  చాలా కాలం త‌రువాత ఒక పూర్తి స్థాయి   వుమెన్ ఓరియెంటెడ్ చిత్రంతో  వ‌చ్చింది.  టెలిప‌తి అనే ఒక కొత్త కాన్సెప్ట్ ను మెయిన్ ప్లాట్ గా చేసుకుని రాశి భ‌ర్త  శ్రీ‌ముని ( పేరు మార్పుచేసుకున్న‌ట్లున్నారు) అలియాస్ శ్రీ‌నివాస‌రావు.. సినిమా చేశారు.  పిల్ల‌ల్ని పోగొట్టుకుని  టెలిప‌తి అనే ఆర్ట్ ద్వారా  పిల్ల‌ల్ని బ్ర‌తికి ఉన్న‌ట్లు ఊహించుకుంటూ జీవితం సాగిస్తుంటున్న మ‌హిళ గా  రాశి న‌టించింది. అలాగే  త‌నకు తెలిసిన టెలి ప‌తి ఆర్ట్ ద్వారా..స్వాతి అనే అమ్మాయిని స‌మ‌స్య‌ల నుంచి కాపాడుతుంది. చివ‌ర‌కు త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటుంది. న‌ట‌న ప‌రంగా త‌న‌కు  ఎక్కవ స్కోప్ వున్న రోల్  ఇది. త‌న రోల్ కు  రాశి వంద‌కు వంద‌శాతం  న్యాయం చేసింది.  అయితే  సెకండాఫ్ లో అనేక ఉప‌క‌థ‌లు పెట్టి  ప్ర‌ధాన క‌థ‌కు అవ‌రోధంగా మ‌ల‌చి ఆడియ‌న్స్ కు ఒక గంద‌ర గోళం సృస్టించాడు డైరెక్ట‌ర్. వాస్త‌వంగా చివ‌రి 30 నిముషాలు సినిమాకు  బ‌లంగా నిలిచింది. అయితే  ఉప‌క‌థ‌లు త‌గ్గితే.. మ‌రింత ఇంపాక్టే ఉండేది లంక చిత్రం.