My title

బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ స్టెప్

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ మార్కెట్ విస్తరించుకున్నాడు. ఈ మార్కెట్ ను.. తర్వాత సినిమాలకు మరింత పెంచుకోవడంపై ప్రభాస్ దృష్టి పెట్టాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో.. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చేయబోతున్న తర్వాతి సినిమా సాహో ను.. బాలీవుడ్ లో ప్రమోట్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నాడు.. ప్రభాస్.

సాహో.. కోసం పర్సనల్ గా ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ను ప్రభాస్ నియమించుకున్నాడట. భారీ మొత్తం ఇచ్చి మరీ.. బాలీవుడ్ కోసమే.. ప్రత్యేకంగా తన కోసమే అపాయింట్ చేసుకున్నాడట. ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను.. పూర్తిగా అతనిమీదే పెట్టాడట. ఇలాంటి వ్యవహారాల్లో దిట్ట అయిన ఆ పబ్లిక్ రిలేషన్స్ పర్సన్.. సాహో ను ప్రెస్టేజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సాహో సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా వావ్ అనిపిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లతో పాటు.. ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలోఉంటారట. శంకర్ ఎహ్ సాన్ లాయ్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టారట. ఏప్రిల్ 28న బాహుబలి విడుదల సందర్భంగా.. ఏప్రిల్ 27నే సాహో టీజర్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.