My title

మహానుభావుడు ఆడియో చీఫ్ గెస్ట్ గా ప్రభాస్….

శర్వానంద్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “మహానుభావుడు”. మెహరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని యువి క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29 న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు జనాలకి ఎక్కేసాయి. అయితే ఈ మూవీలో శర్వానంద్ అతి శుభ్రత గా ఉండాలి అనే ఒక జబ్బు ఉన్న  యువకుడి పాత్ర లో నటిస్తున్నాడు అని టిసర్ చూడగానే అర్ధం అవుతుంది.

ఇకపోతే సెప్టెంబర్ సెకండ్ వీక్ లో జరిగే ఈ మూవీ యొక్క ఆడియో వేడుకకి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట. ఎందుకంటే యూవి క్రియేషన్స్ అనేది  ప్రభాస్ సొంత సంస్థ గా భావిస్తారు. అలాగే ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న “సాహో” మూవీ కి యు వి క్రియేషన్ వారే ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సో ఇదే సన్నిహితంతో ప్రభాస్ “మహానుభావుడు” ఆడియో లాంచ్ ని విడుదల చేస్తున్నాడు. మరి “భలే భలే మగాడివోయ్” తో ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ కొట్టిన మారుతీ ఈ మూవీ తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.