My title

ప్రభాస్‌ ఈ ఫంక్షన్‌కు రావడానికి…. ఈ రెండే కారణాలా?

పబ్లిక్ ఈవెంట్స్ లో పెద్దగా కనిపించడు ప్రభాస్. అది ఎఁతో ఇంపార్టెంట్, తనకు కావాల్సిన వ్యక్తులకు సంబంధించిన సినిమా అయితేనే బయటకు వస్తాడు. బాహుబలిలో తనతో పాటు కలిసి నటించిన రానా కోసం ఆమధ్య ఓసారి బయటకొచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ప్రచారం కల్పించాడు. ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమా కోసం మరోసారి బయటకు రాబోతున్నాడు రెబల్ స్టార్.

తాప్సి హీరోయిన్ గా నటించిన ఆనందో బ్రహ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్, ముఖ్య అతిథిగా వచ్చే అవకాశముంది. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ప్రభాస్ కు తాప్సి చాలా క్లోజ్. గతంలో వీళ్లిద్దరూ కలిసి మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా చేశారు. ఆనందో బ్రహ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రబాస్ ను స్వయంగా ఆహ్వానించిందట తాప్సి. ఇక రెండో రీజన్ ఏంటంటే.. ఆనందో బ్రహ్మ నిర్మాతలు కూడా ప్రభాస్ కు చాలా పరిచయం. ఆ సాన్నిహిత్యం కారణంగా ఆనందో బ్రహ్మ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ హాజరయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.