My title

సార్‌ . వెంట్రుకలకు రంగేసుకోండి…

మంత్రి కేటీఆర్‌కు   ట్విట్టర్‌లో ఊహించని  అనుభవం ఎదురైంది. ట్విట్టర్‌లో ఒక అభిమాని కేటీఆర్‌కు సూచన చేశాడు. ఈ మధ్య కేటీఆర్‌ జుట్టు నెరిసి కనిపిస్తోంది. దీంతో అభిమాని ఒకరు రంగువేసుకోవాలని సూచించాడు.
కేటీఆర్ క్రికెట్ ఆడుతున్న ఫొటోపై యువకుడు ఈ కామెంట్ చేశారు. ‘ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీరే పిన్నవయస్కులు కాబట్టి జుట్టుకు హెయిర్ డై వేసుకోవాలి. అంటూ సూచించాడు. ఇందుకు కేటీఆర్‌ కూడా సమాధానం  ఇచ్చారు. తాను మరీ అంత కుర్రాడినేమీ కాదు అని ట్వీట్ చేశారు.