My title

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మూవీ స్టొరీ తెలిసిపోయింది….

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకాక్ లో చిన్నపాటి షెడ్యూల్లో ఉన్న చిత్ర యూనిట్ అది పూర్తికాగానే యూరప్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన “అత్తారింటికి దారేది” అత్తా మేనల్లుళ్ళ అనుబంధం ప్రధాన అంశంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే.

అలాగే ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుందట. అంతేగాక ఈ చిత్రంలో దాదాపు 7 ఫైట్ సీన్స్ ఉంటాయని కూడా అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ న్యూస్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసుకోనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీ యొక్క పాట టిసర్ ఇటీవలే విడుదలై యూ ట్యూబ్  లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2018 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు మూవీ యూనిట్. ఈ మూవీ కి “ఆజ్ఞ్యత వాసి” అనే టైటిల్ ప్రచారం లో ఉంది.