My title

షార్ట్ గ్యాప్ లో షెడ్యూల్ ప్లాన్ చేసిన పవన్

మరో 10 రోజుల్లో యూరోప్ టూర్ ఉంది. వీసాలు, టిక్కెట్లు రెడీ అయిపోయాడు. ఈ 10 రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవడానికి యూనిట్ టైం తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఈ 10 రోజుల్లో కూడా ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేయబోతున్నారు. ఈ మేరకు మరో 2 రోజుల్లో కర్ణాటక వెళ్లనుంది యూనిట్.

పవన్ సినిమాకు సంబంధించి చిక్-మంగళూరులో ఓ 3 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరో 2 రోజుల్లో ఆ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ లో పవన్-అను ఎమ్మాన్యుయేల్ పై ఓ సాంగ్ లో కొంత భాగాన్ని షూట్ చేయబోతున్నారు. అయితే ఇంత హడావుడిగా ఈ షెడ్యూల్ ప్లాన్ చేయడం వెనక మర్మం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

మరోవైపు పవన్-త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఈ పేరును ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. దీపావళికి ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదలచేసే ప్లాన్ లో ఉంది యూనిట్.