My title

అప్పుడే పుట్టిన తన రెండో కొడుకుని చూసి మురిసిపోతున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య అయిన నందినితో విడాకులు తీసుకున్నాక హీరోయిన్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ రేను దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి అన్నా లేజినోవా అనే రష్యన్ సిటిజెన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి, అన్నా లేజినోవా కి ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా ఇప్పుడు మరొక బిడ్డ కూడా జన్మించింది. అవును ఈసారి వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఈరోజు ఉదయమే అన్నా లేజినోవా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. తన కొడుకుని చూడటానికి పవన్ కళ్యాణ్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అప్పుడే పుట్టిన కొడుకుని ఎత్తుకొని ఎంతో సంతోషించారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లకి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.