My title

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్… నాగ చైతన్య-సమంతలకి ఖరీదైన గిఫ్ట్ ని ప్రెసెంట్ చేసారా?

ఈ నెల 6న  అక్కినేని నాగ చైతన్య, సమంతా  ఒక్కటయ్యారు. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ తర్వాత క్రైస్తవ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమ సినిమా పనుల్లో కూడా పడిపోయారు. అయితే గోవాలో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు ఎక్కువ మంది రాలేదు. కానీ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరో మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త దంపతులకి పెళ్లి రోజే ఒక ఖరీదైన గిఫ్ట్ ని ప్రెసెంట్ చేసాడట. ఆ గిఫ్ట్ సెండ్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అవును పెళ్లి టైంకి గోవాకు రీచ్ అయ్యేలా కాస్ట్లీ రింగ్స్ ని పంపించాడట పవన్ కళ్యాణ్. కాని ఈ పని ఆయన ఒక్కడే చెయ్యలేదు త్రివిక్రమ్ తో పాటు కలిసి చేసాడు. వీరిద్దరూ బయట మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా ఇద్దరూ కలిసే నాగ చైతన్య, సమంతలకి గిఫ్ట్స్ ని ప్రెసెంట్ చేసారు. అయితే అసలు ఇలాంటిదేమీ జరగలేదని ఇది రూమర్ మాత్రమే అని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ గిఫ్ట్ పంపింది నిజమా కాదా అనేది తెలియాలి అంటే సమంతా నోరు విప్పాల్సిందే.