My title

చిన్న‌మ్మ‌కు తంబిల చెక్‌

త‌మిళనాడు రాజకీయాల్లో మళ్లీ సెగ మొదలైంది. మన్నార్‌గుడి మాఫియాకు తంబిలు  చెక్ పెట్టారు. ప‌న్నీరుసెల్వం, ప‌ళ‌నిస్వామిలు వ‌ర్గాలు ఒక్క‌ట‌య్యేందుకు చ‌ర్చ‌లు ఫ‌లించాయి. 99 శాతం రెండు వ‌ర్గాలు ఏకం కావాల‌ని నిర్ణ‌యించాయి. ఇందులో భాగంగా పార్టీలో దిన‌కర‌న్ ఆధిప‌త్యానికి చెక్ పెట్టారు సీఎం ప‌ళ‌ని స్వామి వ‌ర్గం. ఈమేర‌కు పార్టీ ఆఫీసులో స‌మావేశ‌మైన డిప్యూటీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా దిన‌క‌రన్ ఎన్నిక చెల్ల‌ద‌ని తీర్మానం చేశారు. మ‌రోవైపు  దివంగత సీఎం జయలలిత నమ్మినబంటు పన్నీర్‌సెల్వంకు… ఆర్ధిక, ప్రజాపనుల శాఖలతో సహా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం పళనిస్వామి వర్గం అంగీకరించింది.
ఆగస్టు 15కు ముందే విలీన ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని మంత్రి డి జయకుమార్ చెప్పారు. అయితే పన్నీర్‌సెల్వం కు డిప్యూటీ సీఎం పదవి, శాఖల వివరాలపై మాత్రం ఆయన నోరువిప్పలేదు. పన్నీర్ అనుచరులు సెమ్మలై, పాండియరాజన్‌లకు కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. వీరిద్దరికీ కేబినెట్లో స్థానం కల్పించేందుకు మంత్రులు సంపత్, విజయభాస్కర్‌లను రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బయటికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈవారం రోజుల్లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క‌మ‌లుపులు జ‌రిగే అవ‌కాశం ఉంది.