My title

ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. దాదాపు 7 నెలలుగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమాను ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సాయిధరమ్ తేజ, సందీప్ కిషన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తనీష్ విలన్ గా కనిపించబోతున్నాడు. రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటించగా.. శ్రియ ఐటెంసాంగ్ చేసింది.

ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవ్. తాజాగా రిలీజైన ట్రయిలర్ కూడా మెప్పించలేదు. దీనికి తోడు సాయిధరమ్ తేజకు వరుసగా ఫ్లాపులు రావడం, సందీప్ కిషన్ కు కూడా చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడం, కృష్ణవంశీ ట్రాక్ రికార్డు బాగా లేకపోవడంతో ఆడియన్స్ ఎవరూ నక్షత్రాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పుడు నక్షత్రానికి ఓ పోటీ కూడా ఎదురైంది.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న గౌతమ్ నంద సినిమాను కూడా అదే తేదీకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్ నందపై కాస్త బజ్ ఉంది. ఇందులో గోపీచంద్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. సో.. గౌతమ్ నంద ఎఫెక్ట్ పడితే నక్షత్రానికి మరిన్ని చిక్కులు తప్పవు.