My title

పుకారును కూడా పక్కాగా ప్రజెంట్ చేశారు..

మూడు రోజులుగా ఎన్టీఆర్ పై ఓ పుకారు హల్ చల్ చేస్తున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అతడు ఓ రాజకీయ పార్టీని  స్థాపించాడంటూ ఓ పత్రం, సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఒరిజినల్ సంతకాలు కనిపిస్తూ ఏకంగా ఓ డాక్యుమెంట్ బయటకు రావడంతో అంతా అవాక్కయ్యారు. అది ఎంత రియల్ గా ఉందంటే.. నెట్ లోకి వచ్చిన ఆ పేపర్ చూసి అంతా అది నిజమే అనుకున్నారు. ఎన్టీఆర్ నిజంగానే పార్టీ పెట్టాడని భావించారు.

నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఈ పేపర్ లీక్ అయింది. పేపర్ లో సింబల్స్, సంతకాలు అన్నీ ఒరిజినల్ అనిపించేలా ఉన్నాయి. చివరికి అందులో ఇచ్చిన అడ్రస్ కూడా తారక్ ఆఫీస్ కు దగ్గర్లో ఉన్నదే. కానీ ఇవన్నీ అబద్ధాలేనని ఎన్టీఆర్ వర్గం ఖండించింది. నెట్ లో రౌండ్స్  కొడుతున్న ఆ పత్రానికి, ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.

గతంలో రాజకీయాల్లో పనిచేసిన అనుభవం ఎన్టీఆర్ కు ఉంది. అప్పట్లో ఓ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నాడు తారక్. యాక్సిడెంట్ అయి గాయమైనప్పటికీ.. హాస్పిటల్ బెడ్ పై పడుకొని జనాలతో మాట్లాడాడు. సో.. ఈసారి ఈ పేపర్ బయటకు వచ్చేసరికి అంతా నిజమే అనుకున్నారు.