My title

ఎన్టీఆర్ సినిమా రెడీ అయిపోయింది

అనుకున్న టైమ్ కు అనుకున్నట్టుగానే జై లవకుశ సినిమా సిద్ధమైంది. శరవేగంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన యూనిట్.. తాజాగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసింది. సినిమా రన్ టైం లాక్ చేసింది. జైలవకుశ సినిమా 155 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 35 నిమిషాలన్నమాట. తెలుగు సినిమాకు సంబంధించి ఇది డీసెంట్ టైమ్.

ఇదే కాపీని సెన్సార్ కు కూడా పంపించాలని నిర్ణయించారు. గురువారం ఈ సినిమాకు సెన్సార్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. సెన్సార్ జరిగితే ఇన్ సైడ్ టాక్ బయటకు రావడం ఖాయం. సో.. అంతా సెన్సార్ కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో అతడి సరసన రాశిఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సాయికుమార్ ఓ కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 21న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఒకరోజు ముందు నుంచే అమెరికాలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.