My title

త్రివిక్రమ్ సినిమాపై మనసు మార్చుకున్న ఎన్టీఆర్

“జై లవ కుశ” సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ ట్రిప్ నుంచి వచ్చాక జూనియర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా పై దృష్టి పెడతాడు అని అందరికి తెలిసిందే. కాని లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ట్రిప్ బ్యాక్ వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా కంటే ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక మూవీ ని స్టార్ట్ చేస్తాడట ఎన్టీఆర్. ఎన్టీఆర్ సడెన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ కావడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుంది, అంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఆరు నెలలు పట్టేలా ఉంది. ఈలోగా ఎన్టీఆర్ ఖాళీగా ఉండకుండా దిల్ రాజు సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈసారి ఎన్టీఆర్ యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.