My title

నిన్ను కోరి రిలీజ్ డేట్ ఫిక్స్

నాని నుంచి అప్పుడే మరో సినిమా రెడీ అయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్నుకోరి అనే సినిమా చేస్తున్నాడు నాని. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 23న నిన్నుకోరి సినిమా థియేటర్లలోకి రాానుంది. ఈ మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. తర్వాత హైదరాబాద్ లో కొంత షూట్ చేశారు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతోంది. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాతో మహేష్ బాబుతో పోటీపడుతున్నాడు నాని. మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు నాని నటిస్తున్న నిన్నుకోరి సినిమాకు కూడా అదే డేట్ ఫిక్స్ చేశారు. దీంతో మహేష్-నాని సినిమాల మధ్య బాాక్సాఫీస్ క్లాష్  తప్పట్లేదు.

తెలుగులో  శివ నిర్వాణకు ఇదే మొదటి సినిమా. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సరైనోడు సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆది క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.