My title

కాజల్ నుంచి ఊహించని సర్ ప్రైజ్

ఈరోజు కాజల్ పుట్టినరోజు. అదే పెద్ద న్యూస్ అనుకుంటే అంతకంటే భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది కాజల్. అవును.. ఈ బ్యూటీ ఇండస్ట్రీకొచ్చి అప్పుడే హాఫ్ సెంచరీ కొట్టేసింది. అదేనండీ.. 50 సినిమాలు పూర్తిచేసేసింది. దశాబ్దానికి పైగా పరిశ్రమలో కొనసాగుతున్న కాజల్.. నేనే రాజు నేనే మంత్రి సినిమాను తన 50వ సినిమాగా పేర్కొంది. దీంతో కాజల్ అభిమానుల సెలబ్రేషన్లు ఈరోజు రెట్టింపు అయ్యాయి.

అటు నేనే రాజు నేనే మంత్రి టీం కూడా ఈ వేడుకను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. పైగా ఈ ముఖ్యమైన అకేషన్ ను తమ సినిమా ప్రచారానికి కూడా వాడేసుకుంటోంది. కాజల్ 50వ సినిమా.. నేనే రాజు నేనే మంత్రి అంటూ పోస్టర్లు, ప్రెస్ నోట్లు వచ్చేశాయి. రానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రానా మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చాడు. అఫీషియల్ గా ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత కాజల్ వస్తుందా రాదా అనేది అందరికీ డౌట్. ఎందుకంటే కాజల్ ఎప్పుడూ ప్రచారానికి రాదు కదా..