My title

“వీర భోగ వసంతరాయులు” గా నారా రోహిత్….

నారా రోహిత్ హిట్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే “కథలో రాజా కుమారి” సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన నారా రోహిత్ ప్రస్తుతం “బాలకృష్ణుడు” సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నా, అప్పుడే “పండగలా దిగి వచ్చాడు” అనే కొత్త మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇదిలా ఉంటె నారా రోహిత్, శ్రియ శరన్ కలిసి నటిస్తున్న మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు మూవీ యూనిట్. “వీర భోగ వసంతరాయులు” అని టైటిల్ పెట్టిన ఈ మూవీని కొత్త డైరెక్టర్ అయిన ఇంద్ర సేన డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రియ శరన్ పుట్టిన రోజు సంధర్బంగా ఈ మూవీ యొక్క టైటిల్ ని అనౌన్స్ చేసారు మూవీ యూనిట్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ కి సతీష్ రఘునాధన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ లేకపోతే డిసెంబర్ లో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాడానికి ట్రై చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఇదిలా ఉంటె నారా రోహిత్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ సాధినేని దర్శకత్వంలో “భీముడు” అనే ఒక హారర్ మూవీ కి కూడా సైన్ చేసాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.