నారా రోహిత్ సినిమాకు జగపతిబాబు వాయిస్

81

ఒకరి సినిమాలకు మరొకరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మొన్నటికిమొన్న మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రానికి నారా రోహిత్ వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న బాలకృష్ణుడు సినిమాకు జగపతిబాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. ఈనెల 24న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా జగపతిబాబు వాయిస్ తోనే స్టార్ట్ అవుతుందట.

కాస్త ట్రాక్ మార్చి కంప్లీట్ కమర్షియల్ టచ్ తో నారా రోహిత్ చేసిన సినిమా ఇది. పవన్ మల్లెల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించింది. రెజీనా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా నారా రోహిత్ అంటే ఇష్టంతో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు జగపతిబాబు.

నారా రోహిత్ సిక్స్ ప్యాక్ లో కనిపించడమే ఈ సినిమాకు పెద్ద హైలెట్. దీని తర్వాత రమ్యకృష్ణ ఎప్పీయరెన్స్ మరో పెద్ద హైలెట్. ఇప్పుడు జగపతిబాబు వాయిస్ ఓవర్ కూడా మరో హైలెట్ అంటున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES