My title

జగపతిబాబు, నారా రోహిత్ హీరోలుగా మల్టీ స్టారర్ చిత్రం

జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఊపు మీద సినిమాలని ఒప్పుకుంటున్నాడు. దాదాపు ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోస్ అందరి మూవీస్ లోను జగపతి బాబు నటిస్తున్నాడు. అయితే జగపతి బాబు త్వరలో నారా రోహిత్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించబోతున్నాడుట. ఇప్పటికే లావు తగ్గి కొత్త లుక్ లో పవన్ మల్లెల డైరెక్షన్ లో “బాలకృష్ణుడు” అనే మూవీ చేస్తున్నాడు నారా రోహిత్. ఈ మూవీ అయిపోయాక నారా రోహిత్ ఈ మల్టీ స్టారర్ మూవీ స్టార్ట్ చేస్తాడట.

కెరీర్ స్టార్టింగ్ నుంచే నారా రోహిత్ మల్టీ స్టారర్ మూవీస్ లో నటిస్తూ వచ్చాడు. కానీ ఈ సారి నారా రోహిత్ పక్కన జగపతి బాబు కూడా ఉండటంతో ఈ మూవీ పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ని పరుచూరి మురళి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఫ్రెండ్స్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ రేపే గ్రాండ్ గా లాంచ్ అవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ లో హీరోయిన్ ఎవరు, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.