My title

లోకేష్‌నే వెనక్కు నెడుతున్న అచ్చెన్న…

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌… అన్నట్టుగా టీడీపీ నేతల తీరు తయారైంది. వ్యక్తులు చనిపోయిన తర్వాత వారి జయంతిని వర్థంతిగా, వర్థంతిని జయంతిగా మారిస్తే తప్పేంటి అనుకున్నారో ఏమో గానీ నారా లోకేష్‌ బాటలోనే మంత్రులు ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వర్థంతి శుభాకాంక్షలు చెప్పి నారా లోకేష్‌ షాక్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తడబడకుండా జయంతిని వర్థంతిగా మార్చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారు.

 స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్బంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు… లచ్చన్న జయంతిని వర్థంతి అని చెప్పారు. అంతటితో ఆగకుండా వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ఏమాత్రం తడబడకుండా చెప్పారు. వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరమన్నారు. జయంతిని వర్థంతిగా చెప్పడమే ఒక తప్పు అయితే… తిరిగి వర్థంతిని ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్పడం చూసి నారా లోకేష్‌ కంటే తమ మంత్రి చాలా స్పీడ్‌గా ఉన్నారని టీడీపీకార్యకర్తలే సెటైర్లు వేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం ఎంపీ రామ్మోహన్ నాయుడు రిసెప్షన్‌ ఢిల్లీలో జరగ్గా అక్కడికి వెళ్లిన అచ్చెన్నాయుడు… లోక్‌సభ స్పీకర్‌తో ఫొటో దిగారు. ఆ ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పెట్టి లోక్‌సభ స్పీకర్‌ షీలాదీక్షత్‌ అంటూ పోస్ట్ చేశారు. నిజానికి లోక్‌సభ స్పీకర్‌ షీలాదీక్షత్ కాదు.  ఆమె ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. అయినప్పటికీ అచ్చెన్నాయుడు మాత్రం ప్రస్తుత లోక్‌సభ స్పీకర్‌గా షీలాదీక్షిత్‌ను గుర్తించి నెటిజన్లతో సెటైర్లు వేయించుకున్నారు.