My title

వైఎస్‌ నిర్ణయాన్ని తొలిసారి మెచ్చుకున్న లోకేష్

వైఎస్‌ పేరు వింటే చాలు టీడీపీ అధినేత నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు ఎంత కోపమో అందరికీ తెలుసు. వైఎస్‌ను అర శాతం అంగీకరించేందుకు కూడా వారు సిద్దంగా ఉండరు. అయితే బహుశా తొలిసారి కాబోలు నారా లోకేష్‌… వైఎస్‌ చేసిన ఒక పనిని మొచ్చుకున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా గతంలో వైఎస్‌ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పుడు ఆ నిర్ణయాన్నే లోకేష్ సమర్థించారు. పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని వైఎస్‌ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ ప్రభుత్వాలు ఆ సొమ్మును చెల్లించకపోవడంతో పంచాయతీల విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయన్నారు. ప్రస్తుతం పంచాయతీల విద్యుత్ బకాయిలు 13వందల కోట్లకు చేరాయని లోకేష్ చెప్పారు. మరోవైపు ఐటీ ఉద్యోగాల్లో స్థానికులకు కోటా ఇవ్వాలన్న డిమాండ్‌కు తాను వ్యతిరేకమని లోకేష్ చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనడం సరికాదన్నారు. లోకల్ కోటా అడగడం వల్లే పరిశ్రమలు రావడం లేదన్నారు. ఇప్పటికే ఏపీకి ఐటీ పరిశ్రమలను తీసుకురావడం చాలా కష్టంగా ఉందన్నారు.