My title

లోకేషా…. గతంలో మీ నాయన్నూ ఇలాగే అన్నారప్పా….

ఫిరాయింపు రాజకీయాలు ఇప్పుడో ఫ్యాషన్. రాజ్యాంగం, నీతి నియమాలు, నైతికత వంటి వాటితో పనిలేదు. పక్కోడి పార్టీలో నుంచి ఎంతమందిని లాగితే అంత మొనగాళ్లు అన్న తరహా రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్న టీడీపీ… ఇప్పుడు ఇంకా సినిమా అయిపోలేదంటోంది.  జగన్‌ తీరును భరించలేక వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని లోకేష్ చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ఆ ముగ్గురు జగన్‌ తీరుతో విసిగివేసారి తమకు టచ్‌లోకి వచ్చారన్నారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదిస్తున్న సొమ్మును తాము రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నామని లోకేష్ చెప్పుకొచ్చారు. 

అయితే జగన్‌ తీరుతో విసిగివేశారే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారంటున్న లోకేష్‌… గతంలో తన తండ్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది సీనియర్ నేతలు కూడా చంద్రబాబు వైఖరి నచ్చలేదంటూ పార్టీ మారిన విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా పార్టీలు మారుతున్న నేతలంతా స్వార్థంతో తప్పించి సిద్ధాంతాలు నచ్చక పార్టీ మారుతున్నారనుకోవడం భ్రమే. సిద్ధాంతాలు నచ్చే పార్టీలు మారుతుంటే మరి తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు మారినప్పుడు మీ నాన్న అన్ని నీతులు ఎందుకు చెప్పాడో తెలుసుకో లోకేషా అంటూ నెటిజన్ లు కామెంట్లు పెడుతున్నారు.