My title

రియల్  స్టంట్స్  రుచిచూపించిన బాలయ్య

ఈ మధ్య కొత్త సినిమా సెట్స్ లో అసిస్టెంట్ పై చేయిచేసుకున్నాడు బాలయ్య. అది కూడా రియల్ స్టంటే. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అసిస్టెంట్ పై చేయిచేసుకున్న స్టంట్ గురించి కాదు. సినిమా కోసం బాలయ్య చేసిన ఫైట్ గురించి. పైసా వసూల్ సినిమాలో బాలయ్య డూప్ లేకుండా స్టంట్స్ చేశారని పూరి జగన్నాథ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి రుజువుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో శ్రియను పక్కన కూర్చోబెట్టుకొని, కారును గిరగిరా తిప్పేస్తున్నాడు బాలయ్య.
ఇలా రియల్ స్టంట్స్ చేయడం బాలయ్యకు కొత్తకాదు. వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో కూడా ఇలానే చేశాడు. గుర్రాలపై చుట్టూ చేరి బీభత్సం సృష్టించినా, చెక్కుచెదరకుండా తన గుర్రాన్ని అదుపులోకి తీసుకొచ్చాడు. అప్పటి ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్నే ప్రముఖంగా చెప్పారు. ఇప్పుడు కారును గింగిరీలు తిప్పే అంశాన్ని ప్రచారానికి వాడుకుంటారేమో చూడాలి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.