My title

కుంభ‌కోణంలో బాల‌కృష్ణ సినిమా షూటింగ్‌

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రం ప్ర‌స్తుతం కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అక్క‌డ జ‌ర‌గుతున్న భారీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌తో పాటు, పోరాట ఘ‌ట్టాల్ని తెర‌కెక్కిస్తారు.  ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాలుపంచుకొంటుంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకుడు.

బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా మ‌రో నాయిక‌గా న‌టాషా దోషీ ఎంపికైన సంగ‌తి తెలిసిందే.  ప్రకాష్ రాజ్,  మురళీమోహన్, బ్రహ్మానందం, జయ‌ప్ర‌కాష్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రామోజీ ఫిలింసిటీతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఇప్పుడు కుంభకోణం వెళ్లారు. ఆదివారం నుంచి బాలయ్య ఈ సెట్స్ లో షూటింగ్ చేస్తున్నాడు.

చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.