My title

ఆనంకు సమన్లు జారీ… అప్పట్లో ఏమన్నాడంటే…

టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యే రోజా వేసిన పరువు నష్టం కేసులో ఆనం సమన్లు అందుకున్నారు. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. రోజా తరపున వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా, ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి సమర్పించారు.

ఆ రోజు ఆనం వివేకానందరెడ్డి కాస్త ఎక్కువగానే దిగజారి వ్యాఖ్యలు చేశారు. రోజా చిత్తూరు బెల్లం ముక్కని… అందరూ నోట్లు వేసుకోవచ్చని డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పారు 68 ఏళ్ల ఆనం. సినిమాల్లో ఛాన్సుల్లేక తను తుప్పు పట్టిపోయిందన్నారు. టీవీ కార్యక్రమాల్లో కూడా అవకాశాలు ఆగిపోతే రోజా, జగన్ కలిసి రికార్డింగ్ డ్యాన్స్‌లు వేసుకోవాల్సిందే అంటూ ఆనం ఆ రోజు కామెంట్స్ చేశారు. ఈ దిగజారుడు వ్యాఖ్యలపై రోజా కోర్టులో ఆనంపై పరువు నష్టం దావా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 14 =