My title

మేం టీడీపీలో చేరుతామని ఎప్పుడూ చెప్పలేదు – నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌ కాబోతోంది. వారు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇప్పటికే రకరకాల కథనాలు వస్తున్నాయ. కొందరు నల్లారి ఫ్యామిలీ టీడీపీలో చేరుతుందని చెబుతుంటే.. మరికొందరు  జాతీయ పార్టీ వైపు కిరణ్ అడుగు వేస్తారంటున్నారు. ఈనేపథ్యంలో నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి ఒక మీడియా సంస్థతో తన అభిప్రాయలు పంచుకున్నారు. తమకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయన్నారు. కిరణ్‌ సీఎంగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా ప్రజలకు సాయం చేశామన్నారు. అందువల్లే అన్ని పార్టీల వారు తాము వస్తే బాగుంటుందని భావిస్తున్నారన్నారు.

తమకు టీడీపీ కార్యకర్తలే కాకుండా వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి కలుస్తున్నారని కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు. తాము టీడీపీలో చేరుతామని ఎవరితోనూ, ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఈనెల 18 నుంచి నెల పాటు నియోజకవర్గంలోపర్యటించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తన అన్న ముఖ్యమంత్రిగా చేశారని కాబట్టి ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. జాతీయ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి కదా ఆ జాతీయ పార్టీ టీడీపీయేనా అని ప్రశ్నించగా… ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలుగా భావించాల్సింది కాంగ్రెస్‌, బీజేపీలను మాత్రమేనన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.