My title

మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య….

మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా నటించిన మూవీ “మహానుభావుడు”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మెహరిన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటె మారుతీ తన నెక్స్ట్ మూవీ ని నాగ చైతన్య తో చేయబోతున్నాడట. అవును ఇప్పటికే నాగ చైతన్యకి మారుతీ చెప్పిన లైన్ నచ్చి వెంటనే ఒప్పుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి “మంచోడు” అనే టైటిల్ ప్రచారం లో ఉంది. ఇప్పటికే హీరోకి ఏదో ఒక డిసార్డర్ పెట్టడం లో సిద్దహస్తుడైన మారుతీ ఈ మూవీ లో నాగ చైతన్య మంచితనం అనే డిసార్డర్ పెట్టి ఉంటాడు కావొచ్చు అని అంటున్నారు సినీ జనాలు. అయితే ఈ మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ కోసం హీరోయిన్ గా నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్న సమంతాని తీసుకోవాలి అని అనుకుంటున్నారట మూవీ యూనిట్. ఇకపోతే నాగ చైతన్య లేటెస్ట్ మూవీ అయిన “యుద్ధం శరణం” బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇలాంటి టైం లో నాగ చైతన్య మారుతీ లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో మూవీ చేయడం అనేది మంచి విషయమే అంటున్నారు చైతు సన్నిహితులు.