My title

చాలా తక్కువ మంది గెస్ట్ లతో చైతు-సామ్ ల పెళ్లి

నాగ చైత‌న్య‌, స‌మంత‌ల డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అతిథుల లిస్ట్ ఆల్రెడీ పూర్త‌యింది. ఇప్పటికే అతిథులంద‌రికీ పెళ్లి పత్రిక‌లు అందాయి. కేవ‌లం 150 మెంబెర్స్ ని మాత్రమె అక్కినేని ఫ్యామిలీ ఇన్వేట్ చేసిందట. చైత‌న్య‌, స‌మంత కుటుంబ స‌భ్యులు వారిద్ద‌రికీ చెందిన చాలా దగ్గరి వారికి మాత్ర‌మే పెళ్లి పిలుపు అందింది అని టాక్. డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్‌తో గోవాలోని ఒక రిసార్ట్‌లో అక్టోబ‌ర్ 6, 7 తేదీల్లో వీరి పెళ్లి జ‌రుగుతుంది. ఒక రోజు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం, మ‌ర్నాడు క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తి ప్ర‌కారం. బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఎటువంటి హంగామా లేకుండా ఆనందంగా పెళ్లి వేడుకలు జ‌రుపుకోవాల‌నేది సమంత కోరిక‌ట‌. అందుకే నాగార్జున సమంతా కోరిక మేరకు ఇలా ప్లాన్ చేసాడట. ఒకవేళ హైద‌రాబాద్‌లో  పెళ్లి అయితే పెళ్లి వేడుక‌ల‌ను ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉండ‌దు. మొత్తం గెస్ట్‌లంద‌రూ వ‌రుస‌గా క్యూ క‌డుతారు. అంద‌రితో ఫొటోలు దిగేసరికి తెల్లారుతుంది. ఇక సంబ‌రంగా ఎలా జ‌రుపుకోగ‌ల‌మ‌ని స‌మంత భావించింద‌ట‌. కానీ గోవాలో వెడ్డింగ్ అయిపోగానే హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున.