My title

తండ్రి హిట్ సినిమానే కొడుకు క్యారెక్టర్ పేరు

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రారండోయ్ వేడుక చూద్దాం అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాాద్ సంగీతం అందిస్తున్నాడనే విషయం కూడా పాతదే. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ మూవీలో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు బయటపడ్డాయి.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రెస్ మీట్ ఈరోజు జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరోహీరోయిన్ల క్యారెక్టర్ల పేర్లు బయటపెట్టారు. ఇందులో నాగచైతన్య పేరు శివ. గతంలో నాగ్ నటించిన సూపర్ హిట్ సినిమా పేరిది. సెంటిమెంట్ కొద్దీ అదే పేరు పెట్టేశారు. ఇక హీరోయిన్ పేరు భ్రమరాంబ. ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిచే క్యారెక్టర్ పేరిది. అందుకే భ్రమరాంబ అనే పేరుపెట్టారు.

మేకర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈనెలాఖరుకు టోటల్ షూట్ కంప్లీట్ అయిపోతుంది. వచ్చేనెల మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.