My title

విక్ర‌మ్, క‌మ‌ల్ హాస‌న్ బాట‌లో త‌మ‌న్నా…!

త‌మ‌న్నా అన‌గానే వెండి తెర పై హాట్ బ్యూటీ గుర్తొస్తుంది.బాహుబ‌లి లో ప‌చ్చ బొట్టేసిన సాంగ్ చూస్తే చాలు క‌ళా పిపాస‌లు మ‌న‌సులు ఉప్పొంగి పోతాయి. త‌మ‌న్నా గ్లామ‌ర్ ను క‌ళాత్మ‌కంగా ఎలివేట్ చేసిన మంచి రొమాంటిక్ సాంగ్ ను రాజ‌మౌళి అద్భుతంగా డిజైన్ చేశారు. బాహుబ‌లి వ‌ర‌కు కూడా త‌మ‌న్నా గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే చేసింది. ఈ మ‌ధ్య అభినేత్రి అనే త్రి భాష చిత్రంలో న‌టిగా త‌న స‌త్తాను చాటుకునే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో బాహుబ‌లి 2 మాత్రమే ఉంది.

అయితే మ‌రోసారి హిందిలో ప్ర‌భుదేవ స‌ర‌స‌న ఒక చిత్రంలో న‌టించ‌బోతుంది. ఈ చిత్రంలో చెవిటి ,మూగ అమ్మాయిగా త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ట‌. బాహుబ‌లి లో అవంతిక పాత్ర‌లో ఆడియ‌న్స్ త‌న‌ను రిసీవ్ చేసుకోవ‌డంతో.. త‌నను కూడా ఇలా భిన్న‌మైన రోల్ లో ఆడియ‌న్స్ చూస్తార‌నే ధైర్యం వ‌చ్చింద‌ని స్పందించింది. న‌య‌న తార త‌మిళ్ లో న‌టించిన కొలైయ‌తూర్ కాల‌మ్ కు ఈ చిత్ర‌మ్ రీమేక్ గా హిందిలో నిర్మిస్తున్నారు. చ‌క్రి తోలేటి డైరెక్ష‌న్. భూమిక మ‌రో కీ రోల్ చేయ‌నుంద‌ని స‌మాచారం.సో న‌టిగా విక్ర‌మ‌, క‌మ‌ల్ వంటి దిగ్గ‌జాల మాదిరి ప్ర‌యోగాలు చేయ‌డానికి గ్లామ‌ర్ బ్యూటీ సిద్దం అయిన‌ట్లే క‌దా.!