My title

మోడీకి కృతజ్ఞత లేదంటున్న లాలూ

గుజరాత్‌ అల్లర్ల సమయంలో మోడీని ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించాలని వాజ్‌పేయ్‌ నిర్ణయించుకున్నారని, రాజ ధర్మం పాటించలేదంటూ మోడీపై మండిపడ్డారని, మోడీని ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించడం ఖాయం అనుకున్న దశలో ఎల్‌ కే అద్వాని అడ్డుపడి వాజ్‌పేయ్‌ కి నచ్చజెప్పి మోడీని ఆ పదవిలో కొనసాగేలా సహాయ పడ్డాడని లాలూ చెప్పాడు. మోడీకి అంత సహాయం చేసిన అద్వానీకి ఇప్పుడు మోడీ తగిన గుణపాఠం నేర్పుతున్నాడని అన్నాడు. అద్వానీని రాష్ట్రపతి పదవి రేసులో లేకుండా చేయడానికే ఇప్పుడు ఈ కేసును తెరమీదికి తెచ్చాడని లాలూ ఆరోపించాడు. సీబీఐ ప్రధాని చెప్పినట్లు వింటుందని ఈరోజు కోర్టులో సీబీఐ అద్వానీకి వ్యతిరేకంగా వ్యవహరించిందంటే అది మోడీ సూచనల ప్రకారమేనని లాలూ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక అద్వానీ ముందున్న అన్ని అవకాశాలకు మోడీ గండి కొట్టారని అన్నారు.