My title

తప్పుడు వార్తలు రాయొద్దు…. పార్టీ వీడేందుకు నీతిలేని వాన్ని కాదు….

నంద్యాల ఉప ఎన్నికల తర్వాత రోజుకో వైసీపీ నేత మీద  టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. వారంతా పార్టీ వీడేందుకు సిద్ధమైపోయారని.. చర్చలు కూడా ముగిశాయంటూ కథనాలు రాస్తోంది. ఈ కోవలోనే ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూధన్‌ రెడ్డి వైసీపీలో చేరుతున్నారంటూ కథనాలు రాశాయి.  దీనిపై చాలా మంది ఆశ్చర్యపోయారు. పయ్యావుల కేశవ్‌ కుటుంబంతో దశాబ్ధాలుగా వైరం ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీలోకి ఎలా వెళ్తారని భావించారు. అయితే ఆవిషయాలతో సంబంధం లేకుండా కథనాలు వచ్చేశాయి.

ఈ నేపథ్యంలో మధుసూదన్‌ రెడ్డి స్పందించారు. అసత్య కథనాలురాయొద్దని సూచించారు. వారం క్రితం ఒక పత్రిక తాను టీడీపీలో చేరుతున్నట్టు కథనాన్ని ప్రచురించిందన్నారు. అయితే ఆపత్రిక అలాగే రాస్తుందని పట్టించుకోలేదన్నారు. కానీ మంగళవారం మరో పత్రిక కూడా అలాంటి కథనాన్నే రాసిందన్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఎప్పటికీ జగన్‌తోనే ఉంటానన్నారు. తన రాజకీయ జీవితం మొత్తం వైసీపీలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాను విలువలులేని, అనైతిక రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. తనపై తప్పుడు కథనాలు రాసే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ తనపై కథనాలు రాస్తున్న మీడియాపై మధుసూధన్‌ రెడ్డి మండిపడ్డారు. అయితే మధుపై కథనాన్ని రాసిన సదరు పత్రికే… అనంతపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరుతున్నారంటూ కథనాన్ని రాసింది. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!.