నేనూ పాదయాత్ర చేస్తా….

1926

ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ది పనులకు ముద్దుకృష్ణమ అడ్డుపడుతున్నారని ఆమె మండిపడ్డారు. నియోకజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆమె… సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిన గాలి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.

నగరిలో డైయింగ్‌ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, ఆ నీరువల్ల పలు చెరువుల నీరు కలుషితం కాకుండా ఈటీపీ ప్లాంటు ప్రారంభించడానికి కలెక్టర్‌తో మాట్లాడి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు. తాను ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినా తనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అధికారులను బెదిరించి అడ్డుపడుతున్నారని ఆరో పించారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు దున్నపోతుపై వాన పడినట్లుగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కోసం నగరి నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసి రైతులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని, బకాయిలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రైతులకు చెరుకు బకాయిలు చెల్లించేదాకా పోరాడతా నని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, అందుకే ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా చదువుకున్న పిల్లలు
ఖాళీ గా ఉన్నామని చెబుతున్నారని, కంపెనీ లతో మాట్లాడి 17న పుత్తూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.

NEWS UPDATES

CINEMA UPDATES