My title

ఇంతకన్నా వేస్ట్‌ వెధవలు ఉంటారా?

తనకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రోజా కారు ప్రమాదంలో చనిపోయిందంటూ టీడీపీ వర్గీయులు చేస్తున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. రోజా చచ్చిపోయిందని ప్రచారం చేస్తున్న వారి కంటే వేస్ట్‌ వెధవలు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. జగన్‌ జైల్లోనే ఉండాలి, రోజా చచ్చిపోవాలి అని కోరుకుంటున్నారంటే టీడీపీ వారంతా ఎంత ఉన్మాదులుగా మారారో అర్థం చేసుకోవచ్చన్నారు.  ఉన్మాది చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ వారంతా ఉన్మాదుల్లా మారారని రోజా విమర్శించారు. 

చంద్రబాబు చేసిన తప్పులను నిలదీస్తే అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. తాను తొలి నుంచి కూడా భూమా అఖిలప్రియ పట్ల సానుభూతితోనే ఉంటూ వచ్చానన్నారు. కానీ తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో అల్లరి చేయించేందుకు ఒక దళిత మహిళను, ఒక ముస్లిం మహిళను అఖిలప్రియ పంపించిందని అందుకే తాను కూడా నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. అసలు భూమా అఖిలప్రియకు ఉన్న అర్హతలు ఏంటని ప్రశ్నించారు. బికినీ ఫెస్టివల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమైతే చూస్తూ కూర్చున్న టీడీపీ మహిళా నేతలకు తనను విమర్శించే అర్హత ఎక్కడుందని రోజా ప్రశ్నించారు.

రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి… రెండు నెలలుగా నంద్యాలలో కూర్చుని సోది కబుర్లు చెబుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. ఐదు సార్లు ఓడిపోయినా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ను విమర్శిస్తారని సోమిరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్నారు. వరుసగా ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి జగన్‌ను విమర్శించేందుకు సిగ్గు ఉందా అని రోజా ప్రశ్నించారు. వదినను చావుకు దగ్గర చేసి రాజకీయ పునాదులు వేసుకున్న వ్యక్తి దేవినేని ఉమా అని రోజా మండిపడ్డారు.