My title

బస్తీలు తీస్తున్న మోదీ మంత్రులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులకు వ్యాయామంపై దృష్టి పెరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అప్పుడప్పుడు తాను జిమ్ కు వేళ్లి బస్తీలు తీస్తున్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంపుతుంటారు. ఈ సారి రిజిజు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జిమ్ లో వ్యాయామం చేస్తున్న 37 సెకన్ల వీడియో ట్విట్టర్ ద్వారా పంపితే అది ఊరంతా వ్యాపించింది. రాథోడ్ 2004 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించారు.

“పనిలో పడిపోవడం వల్ల మాకు వ్యాయామం చేయడానికి సమయమే చిక్కదు కాని రాథోడ్ ఎలాగో తీరిక చేసుకుని వ్యాయామం చేస్తారు” అని రిజిజు ట్విట్టర్ లో రాశారు. “మీరూ ఎం తక్కువ కాదు. మీరూ వ్యాయామం చేస్తారుగా. మీకు పోటీయే లేదు. మీరే మాకు స్ఫూర్తి” అని రాథోడ్ ట్విట్టర్ లో బదులిచ్చారు.
“నేను కూడా ఇలా వ్యాయామం చేయగలిగితే ఎంత బాగుండును” అని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. రిజిజు, రాథోడ్ సాధారణంగా ఒకే సారి, ఒకే జిమ్ కు వెళ్తుంటారు.