My title

ఇలా చేస్తే నోటి దుర్వాస‌న దూరం

నోరు తెరిచి న‌లుగురిలో మాట్లాడ‌దామంటే దుర్వాస‌న వ‌స్తోంద‌ని భ‌య‌ప‌డ‌తున్నారా ? అయితే, చిన్న చిన్న జాగ్ర‌త్త‌ల‌తో  ఆ స‌మ‌స్య బారి నుంచి బ‌య‌ట‌ ప‌డవ‌చ్చు. 

  • నోటి దుర్వాస‌న రాకుండా ఉద‌యం, రాత్రి ప‌ళ్ల‌ను శుభ్రంగా తోముకోవాలి. రెండుసార్లు దంతాలు శుభ్రం చేసుకోవ‌డం వ‌ల‌న దంతాల మ‌ధ్య ఉన్న పాచిని తొల‌గించ‌వచ్చు.
  • దంతాల మ‌ధ్య పేరుకున్న పాచిని ఫ్లాసింగ్ వంటి ప‌ద్ద‌తుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకోవాలి.
  • ప్ర‌తి ఆరునెల‌ల‌కు ఓసారి దంత‌వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి నోటిని ప‌రీక్షించుకోవాలి. పంటిపై ఏర్ప‌డిన న‌ల్ల‌టి గార‌ను స్కేలింగ్ ద్వారా తొల‌గించుకోవాలి.
  • చిగుళ్ల వ్యాధికి పంటిపై పేరుకున్న గారే ప్ర‌ధాన కార‌ణం.
  • ఆహారంలో పాల ప‌దార్థాలు, విట‌మిన్ సి ఉన్న ఆహారాన్ని చేర్చుకోవాలి.
  • స‌ల్ఫ‌ర్ అధికంగా ఉన్న ప‌దార్థాల‌కు దూరంగా ఉండ‌డం
  • స్వీట్లు, టీ, కాపీ, కూల్ డ్రింక్ ల‌ను ప‌రిమితంగా తీసుకోవ‌డం వ‌ల‌న నోటి దుర్వాస‌న నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.  ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ  నోటి దుర్వాస‌న త‌గ్గ‌కపోతే వెంట‌నే డాక్ట‌రును సంప్ర‌దించాలి.
  • చిగుళ్ల స‌మస‌్య‌లు, కిడ్నీ జ‌బ్బులు, స్త్రీల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో విడుద‌ల‌య్యే హార్మోన్లు, జీర్ణ స‌మ‌స్య‌లు, తీసుకునే ఆహారం కూడా నోటి దుర్వాస‌న‌కు కారణం కావ‌చ్చు. అందువ‌ల్ల డాక్ట‌రును సంప్ర‌దించి స‌రైన చికిత్స తీసుకుంటే నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.